శృంగార సంకీర్తన
రేకు: 1950-4
సంపుటము: 29-238
రేకు: 1950-4
సంపుటము: 29-238
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
| ఎంత వేగిరకాఁడవు యేమందు నేను వింత వింత రతులను వినోదించేవు | ॥పల్లవి॥ |
| వెలఁది నిన్ను దగ్గరి విన్నపాలు సేయఁగాను చిలిమి బలిమి నాపెచన్నులంటేవు పలుమారు వేడుకతో బాగాలు చేతికియ్యఁగా మొలక నవ్వులతోడ మోవి యానేవు | ॥ఎంత॥ |
| పనివూని నీ కాపె పాదములొత్త రాఁగాను చెనకి కుచ్చెలమీఁదఁ జెయి చాఁచేవు వినయముతో నీకు విరులు ముడువఁగాను మనసు పట్టఁగలేక మర్మము లంటేవు | ॥ఎంత॥ |
| వుక్కుమీరి యాపె నీకు వూడిగాలు సేయఁగాను పిక్కటిలఁ గాఁగిటను బిగియించేవు యిక్కడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు చొక్కుచు నాపెతోడ నా సుద్దులు చెప్పేవు | ॥ఎంత॥ |


