శృంగార సంకీర్తన
రేకు: 1950-5
సంపుటము: 29-239
రేకు: 1950-5
సంపుటము: 29-239
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| ఈకెను మన్నించవద్దా ఇంతటనైనా చేకొని యీరీతి నీ సేవలెల్లాఁ జేసెను | ॥పల్లవి॥ |
| వినయముతో నీకు విన్నపము సేయుమని తనమారు చెలి నంపెఁ దరుణి చనవునఁ దనమారు సాగిలి మొక్కించుమని కనకపుబొమ్మ నంపెఁ గనుఁగొనవయ్యా | ॥ఈకె॥ |
| నించి తనమారు యిట్టె నిన్ను సింగారించుమని మించిన పూదండ యంపె మెలుఁత నేఁడు పంచనుండి తనమారు పంతము నీ కిమ్మని అంచెల ముంజేతి చిల్క నంపెను నీవద్దికి | ॥ఈకె॥ |
| నెలకొని తనమారు నీకుఁ బాదాలొత్తుమని మెలుపున వజ్రాల మించు లంపెను నిలిచి శ్రీవేంకటేశ నెట్టవఁ దానె వచ్చి కళలంటి వేఁడుకొని కాఁగిలించె నిన్నును | ॥ఈకె॥ |


