అధ్యాత్మ సంకీర్తన
రేకు: 24-4
సంపుటము: 1-146
రేకు: 24-4
సంపుటము: 1-146
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| [1]వలపు లధికము సేయు వైభవములు తలఁపు లధికము సేయుఁ దలపోఁతలు | ॥వలపు॥ |
| కోప మధికము సేయుఁ గోరికలు తాప మధికము సేయుఁ దమకంబులు కోపంబుఁ దాపంబుఁ గూడ నధికము సేయు యేపయిన మోహముల నేమందమే | ॥వలపు॥ |
| మచ్చి కధికము సేయు మన్ననలు యిచ్చ లధికము సేయు నీరసములు మచ్చికలు నిచ్చలును మగుడ నధికము సేయు నెచ్చరిక కూటముల నేమందమే | ॥వలపు॥ |
| అంద మధికము సేయుఁ నైక్యములు పొందు లధికము సేయుఁ బొలయలుకలు అందములుఁ బొందులును నలర నధికము సేయు నెందు నరుఁదగు వేంకటేశు కృపలు | ॥వలపు॥ |
[1] ఇది ఒకపాటి శృంగారకీర్తనల ఛాయలోనిది.


