శృంగార సంకీర్తన
రేకు: 1953-1
సంపుటము: 29-253
రేకు: 1953-1
సంపుటము: 29-253
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధదేశి
| నీ వేమి సేసినాను నీకుఁ జెల్లును వేవేలు చందాలను వేఁడుకొనే నిన్నును | ॥పల్లవి॥ |
| మాఁటలు నాతో నాడుతా మళ్లి చూచే వేమి నీవు ఆఁట దెవ్వతో చూచీనంటానో నిన్ను చాటువెట్టుకొని కొంత సన్నలు సేసేవు నాతో మాటిచ్చుకున్నాఁడవో మరియు నాపెకును | ॥నీవేమి॥ |
| వొద్దఁబండ్డుండి యవ్వల నొగిఁ జోటిచ్చుకుండేవు నిద్దరించేవేళ నాపె నీవుఁ గూడేవో వొద్దికఁ బుక్కిట దాఁచుకున్నాఁడవు తములము చద్ది గట్టిపెట్టితివో సరుగ నాపెకును | ॥నీవేమి॥ |
| పొంకముగా జాగరాలఁ బొద్దువుచ్చ వాపెను కంకణము గట్టి తొల్లె కలసితివో అంకెల శ్రీవేంకటేశ అంతలో నన్నేలితివి ఇంక నీకు వెఱపులే దెరుఁగదు నవ్వితి | ॥నీవేమి॥ |


