శృంగార సంకీర్తన
రేకు: 1953-5
సంపుటము: 29-257
రేకు: 1953-5
సంపుటము: 29-257
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఇంక నిన్ను దూరను యియ్యకొంటి నీ యానతి కంకణము గట్టితి వీకాలమునాఁడే | ॥పల్లవి॥ |
| యెన్ని లేవు విన్నపాలు యిట్టె సేసేనంటే నీకు మన్నించినదే గురుతు మాకు నీవు సన్నలు చాలుఁగలవు సారెఁ బాచారించేనంటె వన్నెల మా యింటికి వచ్చుటే గురుతు | ॥ఇంక॥ |
| యెంతని చెప్పుదు మోహ మిట్టె నీకుఁ జూపెనంటే యింతగా లాలించినదే యెక్కుడు నాకు వంతుల కలివి యేది వాసులు వట్టేనంటే చెంతనుండి నాతో పొందుసేసినదే గురుతు | ॥ఇంక॥ |
| యెక్కడ గొలఁది సేవలిట్టే నేఁ గావించేనంటే యిక్కడ నన్నేలినదే యింపు నాకు నెక్కొని శ్రీవేంకటేశ నీకు నే మొక్కేనంటే లెక్క యేది నీ వేలినలీలలే గురుతు | ॥ఇంక॥ |


