శృంగార సంకీర్తన
రేకు: 1954-4
సంపుటము: 29-262
రేకు: 1954-4
సంపుటము: 29-262
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| మన్నించుఁగాక వట్టి మరఁగులేలే తిన్నని నా గుణాలివి తెలుసుకొమ్మనవే | ॥పల్లవి॥ |
| మొగము చూచినప్పుడే మునుకొనె నాసలు నగినప్పుడే వెలసె ననుపులెల్లా తగిలి మాఁటాడితేనే తలపోఁత లీడేరె మగఁడాయ నాకుఁ దాను మనసేమి చూచీనే | ॥మన్నించు॥ |
| సరుసఁ గూచున్నప్పుడే జంటాయఁ జుట్టరికము తెరదీసినప్పుడే పొందిక లమరె సరసమాడినప్పుడే సతమాయ భోగములు మరుతంత్రములతోడ మనసేమి చూచీనే | ॥మన్నించు॥ |
| మేనులు సోఁకినప్పుడే మేరసె సంతోసము తేనె మోవిచ్చినప్పుడే తేరెఁ బనులు తానె వచ్చి నన్నుఁ గూడె తగ శ్రీవేంకటేశుఁడు మానాపతినైన నా మనసేమి చూచీనే | ॥మన్నించు॥ |


