శృంగార సంకీర్తన
రేకు: 1955-5
సంపుటము: 29-269
రేకు: 1955-5
సంపుటము: 29-269
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| తన గురుతులు మేనఁ దారుకాణలై యుండఁగా పెనఁగుచు నవ్వులేల పెంచీనే తాను | ॥పల్లవి॥ |
| మాట లెన్త్నెనాఁ గలవు మళ్లి మళ్లి యాడితేను పేటలుగా నాన లేల పెట్టినే తాను నీటుల తన సుద్దులు నిన్ననే వింటి నేను పాటించి న న్నేల వొడఁబరచీనే తాను | ॥తన॥ |
| తక్కులెన్త్నెనా గలవు తవ్వి తవ్వి పోసితేను మిక్కిలి యంతేశి నమ్మించీనే తాను గక్కున తనచేఁతలు కన్నులారాఁ గంటి నేను కక్కసించి మనసేల కరఁచీనే తాను | ॥తన॥ |
| పొందులెన్త్నెనాఁ గలవు పొంచి పొంచి కూడేనంటే ముందు ముందుగా నన్నేల ముట్టీనే తాను చెందె నలమేల్మంగను శ్రీవేంకటేశుఁడు తాను అందుకొంటి విడె మేల యడిగీనే తాను | ॥తన॥ |


