శృంగార సంకీర్తన
రేకు: 1957-3
సంపుటము: 29-279
రేకు: 1957-3
సంపుటము: 29-279
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| ఇదివో నా మోహము నీ కెంతని చెప్పుదు నేను కదిసి నీ మోము చూచి కన్ను మూయఁజాలను | ॥పల్లవి॥ |
| వొత్తి నిన్ను దూరనోప వొట్టులు వెట్టఁగనోప హత్తి నీతో నిచ్చకము లాడేఁగాని కొత్తగాఁ గొసరనోప గోరికొన గీరనోప చిత్తమురా సేవలిట్టె సేసేఁగాని | ॥ఇది॥ |
| పెనఁగి గుంపించనోప బీరము చూపఁగనోప ననుపు సేసుక నీతో నవ్వేఁగాని పొనుఁగుచు దాఁగనోప బొమ్మల జంకించనోప వినయాన మొక్కి నిన్ను వేఁడుకొనేఁగాని | ॥ఇది॥ |
| సిగ్గుతో నలుగనోప శిరసు వంచఁగనోప వొగ్గి మోవి తేనెకు నోరూరేఁగాని వెగ్గళముగా నన్ను శ్రీవేంకటేశ యేలితివి యెగ్గు లెంచనోప నిన్ను నిట్టె మెచ్చేఁగాని | ॥ఇది॥ |


