శృంగార సంకీర్తన
రేకు: 1958-1
సంపుటము: 29-283
రేకు: 1958-1
సంపుటము: 29-283
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| తా నెంత నీ వెంత తగిలి తగిలి నిన్నుఁ - బూని వలపించి యీకె పొదలెఁ గదవయ్యా | ॥పల్లవి॥ |
| చిడుముడిఁ వూడిగాలు సేసిసేసి యాపె నీకు కడుఁ జనవరి యాయఁగదవయ్యా నడుమ నూరక నీతో నవ్వి నవ్వి రాజసాన వెడఁగుగర్వాన విఱవీఁగీఁ గదవయ్యా | ॥తానెంత॥ |
| మక్కళించి యాపె నీతో మాఁట లాడి యాడి నీకు గక్కననుఁ జుట్టమాయఁ గదవయ్యా చిక్కించుక కొలువులు సేసిసేసి నిలుచుండి వెక్కసపుఁ బంతుములే వెలసెఁ గదవయ్యా | ॥తానెంత॥ |
| వొపికతోఁ జన్నుల నిన్నొత్తి యొత్తి యాపె నీకుఁ గాఁపురాలు సేయ నేర్చెఁ గదవయ్యా యేపున శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు నీ పొందులఁ దా నింటిలో నిలిచెఁ గదవయ్యా | ॥తానెంత॥ |


