శృంగార సంకీర్తన
రేకు: 1959-2
సంపుటము: 29-290
రేకు: 1959-2
సంపుటము: 29-290
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| చెప్పఁ గొత్తలాయఁ గదె చెలియ నీ సుద్దులెల్లా ముప్పిరిగొన్న వలపు మూల దాఁచ నేఁటికి | ॥పల్లవి॥ |
| చనుఁగొండల మీఁదట చఁదోదయములాయ ఘనముగా వెన్నెలలే కాయవుగాని పెనగొన్న చిగురుపై పెనువాన లుప్పతిలె యెనసియు వాడుదేరదేయోకాని | ॥చెప్పఁ॥ |
| అంచెలఁ జీఁకటితీగె లటునిటు నిండుకొనె కొంచించక యట్టె పొద్దు గుంకదుగాని పొంచి కెందామరలు గొబ్బున వికసించెను ముంచుకొని తుమ్మిదలే మూఁగవుగాని | ॥చెప్పఁ॥ |
| గక్కన నద్దములోనఁ గళలు మెరువఁ జొచ్చె వుక్కుమీరి మేఘము లెందున్నవోకాని ఇక్కడ శ్రీవేంకటేశుఁ డిఁతలోనె నిన్ను నేలె పక్కన మరుఁడే నీకుఁ బంత్తమిచ్చెఁగాని | ॥చెప్పఁ॥ |


