శృంగార సంకీర్తన
రేకు: 1959-5
సంపుటము: 29-293
రేకు: 1959-5
సంపుటము: 29-293
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
| ఏమి చెప్పుకొనేవే యింతులతో నీ యెమ్మెలు వేమరు నీ గుట్టు వెల్లవిరిసేయ నేఁటికే | ॥పల్లవి॥ |
| కలికితనాల నీవు కాఁపురాలు సేయఁగాను వలవ కెట్టుండునే రవ్వగా మగఁడు చలిమి బలిమితోడ జాణతనా లాడఁగాను సులబాన నీ కతఁడు చొక్కవలెఁగదవే | ॥ఏమి॥ |
| యెన్నికతో నేపొద్దూ యెదుటఁ గాచుకుండఁగాను మన్నించ కెట్టుండునే మరి యాతఁడు సన్నలనే మోవి తేనె చవులెల్లాఁ జూపఁగాను మిన్నక నీ చేఁతలకు మెచ్చవలెఁగదవే | ॥ఏమి॥ |
| కమ్మి సింగారించుకొని కాఁగిటఁ బెనఁగఁగాను సమ్మతించ కెట్టుండునే సరుగదాను యిమ్ముల శ్రీవేంకటేశుఁ డితఁ డిట్టె నన్ను నేలె నమ్మించి నీ కతలకు నవ్వవలెఁగదవే | ॥ఏమి॥ |


