Display:
శృంగార సంకీర్తన
రేకు: 1960-4
సంపుటము: 29-298
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
వద్దనేమా నేము మాతో వర్ణించే వాకెను
పెద్దరికమున నింత పెంచితివి చాలదా
॥పల్లవి॥
చక్కనిదంటా నాకె చందము లేమి చెప్పేవు
గక్కన నింపైతే మెడఁగట్టుకోరాదా
నెక్కొని యాకెఁ జూచి నివ్వెరగే లయ్యేవు
అక్కరతోఁ బిలిచి మాఁటాడఁగరాదా
॥వద్ద॥
మాతో నాకె గుణాలేల మచ్చికఁ బచారించేవు
చేతులెత్తి మెచ్చి సంతోసించఁగరాదా
రాతిటి యాకె రతులు రచ్చ నేల వేసేవు
కాతరానఁ జిక్కి వుడుగర లియ్యరాదా
॥వద్ద॥
ఆకెనీవావులు యీడ నది యాల తడవేవు
చేకొని మీలో మీరే చెప్పుకోరాదా
యీకడ శ్రీవేంకటేశ యెనసితి నన్ను నేఁడు
జోకతో నేమి నవ్వేవు చోటియ్యరాదా
॥వద్ద॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము