శృంగార సంకీర్తన
రేకు: 1960-6
సంపుటము: 29-300
రేకు: 1960-6
సంపుటము: 29-300
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| చుట్టపు వరుసలనే సోబనకాలము వచ్చె యిట్టె కలకాలము నేలుకొనవయ్యా | ॥పల్లవి॥ |
| వెలఁదికి విరహపువేసఁగికాలము వచ్చె కెలిగె నిట్టూర్పుల గాలికాలము వలపులచెమటల వానకాలమును మించె యెల యింపు లిఁకనేల ఇంటికి రావయ్యా | ॥చుట్ట॥ |
| పడఁతి మై పులకల పైరు కాలము వచ్చె కడుఁగోరికల మంచుఁగాలము మీరె అడరి యెడమాఁటల ఆమనికాలమూఁ గూడె తడవుసేయక యట్టె దయఁ జూడవయ్యా | ॥చుట్ట॥ |
| సతి రతి చెనకుల జాజరకాలుము వచ్చె కతలై నవ్వు వెన్నెలకాలమూ రేఁగె తతిఁ గూడితివి యీకెఁ దగ శ్రీవేంకటేశ్వర సతమై యీలాగులఁ జనవియ్యవయ్యా | ॥చుట్టు॥ |


