Display:
శృంగార సంకీర్తన
రేకు: 1961-1
సంపుటము: 29-301
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
ఇన్నాళ్ళు నెఱఁగము యిటువంటివి
సన్నలు మీలో మీకు సరివచ్చెనా
॥పల్లవి॥
చిమ్మిరేఁగి నీ కిందాఁకాఁ జేసి నాకె విన్నపాలు
వుమ్మడి నీ మనసందు కొడఁబడెనా
కమ్మటి నీ పాదలొత్తె కదిసి సేవలు సేసె
సమ్మతించి నీ వందుకు సరుగ మెచ్చితివా
॥ఇన్నా॥
నేమమున నీతోడ నెత్తమాడెఁ జిక్కించుక
దోమటి నీ కిప్పుడ సంతోసమాయనా
వాములుగా నీమీఁద వలపులు చల్లి నవ్వె
ప్రేమముతోడుత నీవూఁ బ్రియము చేకొంటివా
॥ఇన్నా॥
గక్కనఁ జుట్టమువలెఁ గాఁగిలించు కొననాపె
చక్కెర మోవి యొసఁగి చవిగొంటివా
ఇక్కడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
మక్కువతో మమ్మిద్దరి మన్నన నేలితివా
॥ఇన్నా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము