శృంగార సంకీర్తన
రేకు: 1961-3
సంపుటము: 29-303
రేకు: 1961-3
సంపుటము: 29-303
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| అటువంటి సతి నీకు నమరె నాయకుఁడ తటుకన నీకె తగుఁ దగునయ్యా | ॥పల్లవి॥ |
| చలముల నూరకసారెకు దూరక మెలుపున నానలు మీరక కిలఁ కిలఁ బతితో కెలయుచుఁ గేరక తలఁపులో మెలఁగు తరుణివో జాణ | ॥అటు॥ |
| పగటులు చూపక పంతాన నేఁపక మొగిఁ దప్పులు కడు మోపక అగడుసేసి వెడయాసలు రేఁపక నిగిడి రతిఁ గలయు నెలఁతవో జాణ | ॥అటు॥ |
| జాగులు సేయక జంటలు వాయక వేగిరపడి వొల వేయక యీగటి శ్రీవేంకటేశ మాఁట దోయక బాగుగఁ గూడిన పడఁతివో జాణ | ॥అటు॥ |


