శృంగార సంకీర్తన
రేకు: 1961-4
సంపుటము: 29-304
రేకు: 1961-4
సంపుటము: 29-304
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
| నీ వొళ్ళఁ గడమలేదు నేరుపరివి నౌదువు యీవేళ నీ మగఁడు నిన్నేమనీనోకాని | ॥పల్లవి॥ |
| చీరాఁ గట్టుకొంటివి సింగారించుకొంటివి బీరముతోఁ బెద్దకొప్పు వెట్టుకొంటవి గారవానఁ గన్నులను కాటుక దిద్దుకొంటివి కోరి నీ మగఁ డెప్పుడు గూడీనోకాని | ॥నీవొళ్ళఁ॥ |
| వీడెమూ వేసుకొంటివి విరులు ముడిచితివి వేడుక సొమ్ము వెట్టుక వెలసితివి వాడుదేరఁ గస్తూరి వన్నెగాఁ బూసుకొంటివి యీడనే నీమగఁ డెప్పు డేలీనోకాని | ॥నీవొళ్ళఁ॥ |
| వచ్చితి వింటికిఁ గొంగు వల్లెవాటు వేసితివి కొచ్చి నవ్వి పరపుపైఁ గూచుంటివి అచ్చపు శ్రీవేంకటేశుఁ డప్పుడే నన్నుఁ గూడె హెచ్చి యీ మగఁడే ని న్నెట్టెనసీనోకాని | ॥నీవొళ్ళఁ॥ |


