శృంగార సంకీర్తన
రేకు: 1962-1
సంపుటము: 29-307
రేకు: 1962-1
సంపుటము: 29-307
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| కొమ్మ గడుజవరాలు కోమలపు మేనిది నెమ్మది నుపలాలించి నెయ్యము చూపరాదా | ॥పల్లవి॥ |
| నిలుచుండి మాఁటలాడీ నెలఁత యప్పటనుండి పిలిచి వద్దఁ గూచుండఁ బెట్టుకోరాదా బలిసిన చనుఁగవభారము మోచుకున్నది అలరి నీ భుజముల నానుకొనరాదా | ॥కొమ్మ॥ |
| నిండుఁ గొప్పు జారఁగానే నీకు విడె మిచ్చీని అండనుండి గక్కన నీ వందుకోరాదా మెండుగ వలపు లొడి మెరసి కట్టుకున్నది దండితో నీవూఁ గొంత తాళుకోరాదా | ॥కొమ్మ॥ |
| పచ్చి చెమటలుఁ బక పక నవ్వీ నీతో మచ్చికఁ గాఁగిట నించి మన్నించరాదా ఇచ్చట శ్రీవేంకటేశ యేలితివీకె నింతలో కుచ్చి నీ పాదము లొత్తీఁ గోరి మెచ్చరాదా | ॥కొమ్మ॥ |


