శృంగార సంకీర్తన
రేకు: 1962-3
సంపుటము: 29-309
రేకు: 1962-3
సంపుటము: 29-309
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| ఈకె నెట్టు దగిలితి వింతులెల్లా నుండఁగాను నీకంటె మూరెఁ డెక్కుడు నీటుఁదనములను | ॥పల్లవి॥ |
| చెక్కుటద్దములు చూపి చెలి నిన్ను నెలఇంచె జక్కవ చన్నులు చూపి చల్లె వలపు నిక్కుఁ గొప్పు చూపి కొంత నీ మనసు గరఁగించె ఇక్కువలంట్టి తమక మింకా నెంత రేఁచునో | ॥ఈకె॥ |
| సెలవుల నవ్వు నవ్వి సిగ్గులెల్లా విడిపించె సొలపుఁ జూపులఁ జూచి చొక్కించెను వెలయఁగొన గోరూఁది వేడుకలు పుట్టించె మలసి కాఁగిటఁ గూచ్చి మరి యెంత సేసునో | ॥ఈకె॥ |
| కరములు పైఁ జాఁచి కళ లుప్పతిలఁజేసె సరుసనే మోవి చూపి చవులు నించె యెరవులేక శ్రీవేంకటేశ నన్ను నేలితివి యిరవయి తానూఁ గూడి యిట్టె యెంత సేసునో | ॥ఈకె॥ |


