శృంగార సంకీర్తన
రేకు: 1962-4
సంపుటము: 29-310
రేకు: 1962-4
సంపుటము: 29-310
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఏ కాంత సేసినవో యీ చేఁతలు ఆకె యెటువంటిదో ఆనతియ్యవయ్యా | ॥పల్లవి॥ |
| పుప్పొడి దాఁకినచోటు పువ్వులవేసినవాటు చొప్పు నీ మేన నున్నది చూచుకోవయ్యా చిప్పిలిపారేటియేరు చిమ్మనఁగోవిపన్నీరు తెప్పలఁ దేలేవు నీవే తెలుసుకోవయ్యా | ॥ఏ కాంత॥ |
| కురులువట్టిన పట్టు కూడని చొల్లెపు చుట్టు అరసి నీ చెలులనే అడుగవయ్యా వురము ముద్రల పొత్తు వుదుటుఁజన్నుల వొత్తు సరుగ నీకు నీవే విచారించుకోవయ్యా | ॥ఏ కాంత॥ |
| చెక్కున నుండిన రేక చిన్నికొనగోరి జోక యిక్కువ లవిగో నీవే యెంచుకోవయ్యా గక్కన శ్రీవేంకటేశ కాఁగిట నన్నేలితివి తక్కక నీ వేడుకలు తలఁచుకోవయ్యా | ॥ఏ కాంత॥ |


