శృంగార సంకీర్తన
రేకు: 1962-5
సంపుటము: 29-311
రేకు: 1962-5
సంపుటము: 29-311
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాగవరాళి
| అవి యేఁటి యేకాంతాలో అడుగవయ్యా తివిరీ నప్పటనుండి తెలుసుకోవయ్యా | ॥పల్లవి॥ |
| కన్నులఁ దప్పక చూచి కడు బొమ్మల జింకించి సన్నలుసేసీ నాకె సారెకు నీతో చిన్నిపెదవుల లోలోసిగ్గుతోనె మాఁటలాడి ఇన్నేసి చేఁతలు సేసి యిట్టె యేఁకారీని | ॥అవి॥ |
| చుట్టి చుట్టి లాచి లాచి సోఁకఁ గప్పురాన వేశి గుట్టుతోఁ గొలువులోనఁ గొసరీ నిన్ను పట్టెఁడేసి చన్నులు పచారించి నీకుఁ జూపి నెట్టన నప్పటనుండి నీకుఁ బొంచుకున్నది | ॥అవి॥ |
| చిప్పిలఁగ నవ్వు నవ్వీ చేతులు నీపైఁ జాఁచి చొప్పువేసీఁ జెప్పరాని చుట్టరికము యిప్పుడు శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు కప్పి పయ్యదమాఁటునఁ గరఁగించీ నిన్నును | ॥అవి॥ |


