శృంగార సంకీర్తన
రేకు: 1964-1
సంపుటము: 29-319
రేకు: 1964-1
సంపుటము: 29-319
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| తగవైతే నింతటను దయదలఁచఁగవలె జిగి మా విన్నపములు చిత్తగించవయ్యా | ॥పల్లవి॥ |
| వట్టిమాఁకు లిగిరించ వనిత మాఁటలాడీని వెట్టికి నూఁకొనవద్దు వినవయ్యా గుట్టుతో రాయి గరఁగఁ గొలువులు సేసీని అట్టు నిట్టూఁ బరాకుగా కవధరించవయ్యా | ॥తగు॥ |
| కోటకిఁ బడగలెత్తి కుచములు నీకుఁ జూపీ జూటుఁదనములు మాని చూడవయ్యా తేటతెల్లములుగాను తెలసీ వావులు నీకు నీటున సిగ్గువడక నెయ్యము చూపవయ్యా | ॥తగు॥ |
| పోఁకకుఁ బుట్టెఁడు సేసి పొందుగా వలపు లమ్మీ యాఁకటలు దాఁచక అందుకోవయ్యా కాఁకదీరఁ గాఁగిలించీ గక్కన శ్రీవేంకటేశ వీఁకలు సేయక కూడి వెలయించవయ్యా | ॥తగు॥ |


