శృంగార సంకీర్తన
రేకు: 1964-2
సంపుటము: 29-320
రేకు: 1964-2
సంపుటము: 29-320
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| సిగ్గువడ దించుకంతా చెలులెల్లాఁ జూడఁగాను బిగ్గెఁ గాఁగిలించుకొనీఁ బ్రియమెంతోకాని | ॥పల్లవి॥ |
| వేవేలు చుట్టరికాలు వేడుకతో నెరపీని వావి నాపె నీకేమిగావలెనోకాని దేవులవలెఁ గడు హత్తిన సేవలెల్లాఁ జేసీ భావించితే నెట్టి వొడఁబడికలోకాని | ॥సిగ్గు॥ |
| చెప్పరాని బత్తి నీపైఁ జేసి సేసి చూపీని యెప్పుడూ మీ నేస్తమ లేఁటివోకాని వొప్పగుపెండ్లికూఁతురే వొద్దనే కాచుకున్నది చెప్పరాని సలిగెంత చెల్లించేవోకాని | ॥సిగ్గు॥ |
| నాఁటుకొన్న తమితోడ నవ్వులెల్లా నవ్వీని చాటువైన మీలో నేమి సన్నలోకాని యీటున శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు మాటలాడీ నాపె నీపై మచ్చికెంతోకాని | ॥సిగ్గు॥ |


