శృంగార సంకీర్తన
రేకు: 1964-3
సంపుటము: 29-321
రేకు: 1964-3
సంపుటము: 29-321
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
| అమ్మలాల అక్కలాల అవిగో వింత సుద్దులు నెమ్మది వింటిరటరే నిచ్చ నిచ్చ కొత్తలు | ॥పల్లవి॥ |
| అల్ల వాఁడే శ్రావణ బహుళష్టమిని నడురేయి చల్లఁగా రోహిణివేళ జనించినాఁడు వెల్లవిరి దేవకిదేవికి వసుదేవునికి మొల్లమిఁ గొడుకైనాఁడు ముద్దులకృష్ణుఁడు | ॥అమ్మ॥ |
| పొంచి యశోదానందగోపులకు సుతునివలెఁ బెంచఁగా రేపల్లెలోనఁ బెరిగీ వీఁడె ముంచి యీతనికంటేనె ముందే బలభద్రుఁడు అంచెల రోహిణీదేవి కవతరించినాఁడు | ॥అమ్మ॥ |
| మొదల దేవకతలకు మూలభూతి యితఁడట యెదుట లోకములెల్లా నేలీనటా అదిగో శ్రీవేంకటేశుఁడై యలమేల్మంగాఁ దాను చెదకు కాఁపురాలు సేసీనటా | ॥అమ్మ॥ |


