శృంగార సంకీర్తన
రేకు: 1964-4
సంపుటము: 29-322
రేకు: 1964-4
సంపుటము: 29-322
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| మన చేతికిఁ జిక్కెను మగువలాల వినయాన వేఁడుకోరే వీఁడె కాంతలాల | ॥పల్లవి॥ |
| వుబ్బుచుఁ గృష్ణుఁడు వాఁడే వుట్టులు గొట్టీ నదే గొబ్బునఁ బట్టఁగదరే గొల్లెతలాల అబ్బరపుఁ బాలు వెన్న లారగించి వారవట్టీ దొబ్బి తీసుకోరమ్మా తొయ్యలులాల | ॥మన॥ |
| యింటింటి వాకిట వచ్చి ఇదె చక్కిలాలు దీసీ అంటి పెనఁగులాడరే యంగనలాల దంటయై గోపాలులుఁ దానూఁ బరువులు వెట్టీ వెంటనే తగులరమ్మా వెలఁదులాల | ॥మన॥ |
| కాకుసేసి చన్నులంటి కాఁగిలించుకొనవచ్చీ యేకతాలకుఁ దియ్యరే యింతులాల యీకడ నలమేల్మంగ నేలి శ్రీవేంకటేశుఁడు మీ కోరి కిచ్చె మొక్కరే మెలుఁతలాల | ॥మన॥ |


