శృంగార సంకీర్తన
రేకు: 1965-2
సంపుటము: 29-326
రేకు: 1965-2
సంపుటము: 29-326
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఎంతైనాఁ దనతో నే నెగ్గుపట్టేనా చెంతనుండి నాచే సేవ సేయించుకొనుఁగాక | ॥పల్లవి॥ |
| సేయఁగలవెల్లాఁ జేసి సిగ్గులు వడఁగ నేలే చాయ సేసుకొని పొందు జరపుఁగాక యే యెడనో వుండి వచ్చి యేల వొడఁబరచీనే నాయందు కూరిమి చల్లి నవ్వుఁగాకా | ॥ఎంతై॥ |
| ముం దెవ్వతెనో పెండ్లాడి మొక మేమి చూచీనే అందాలు సేసుక మాఁటలాడుఁగాక విందు లెందో ఆరగించి విడెము లే లడిగీనే అంది నా పానుపుపైనే యవధరించుఁగాకా | ॥ఎంతై॥ |
| చుట్టాల సురభి తాను చొక్కుల నేల పెట్టీనే గుట్టుతోడ నా కాఁగిటఁ గూడుఁగాక యిట్టె శ్రీవేంకటేశుఁ డేలి న న్నేల మెచ్చీనే జట్టిగాఁదనకే మోవి చవిచూపుఁగాకా | ॥ఎంతై॥ |


