Display:
శృంగార సంకీర్తన
రేకు: 1965-6
సంపుటము: 29-330
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కేదారగౌళ
పతివి నీతో నాకు పంతము గాదా
రతివేళ యిది సుమ్మీ రాఁపుసేయ కిఁకను
॥పల్లవి॥
నిన్నుఁ బాసి తమకము నిలుపఁ జాలక నేఁ
గన్నుల జంకించితిఁ గసరితిని
మన్నింతువు గనక నా యందెమేళ మిట్టుండె
చిన్నదానఁ జుమ్మీ నీ చిత్తము నే నెఱఁగ
॥పతి॥
విరహాతాపముచేత విసిగి నీవు రావంటా
విరులఁ గొని వేసితి వేసరించితి
మరిగించితివిగన మదము నా కిట్టుండె
సదసమాడితిఁ జుమ్మీ చలము సాదించను
॥పతి॥
పాయప టాసలచేత బలిమిఁ బైకొని యిట్టె
చెయి నీపై వేసితిఁ జెనకితిని
యీయెడ శ్రీవేంకటేశ యింతలో నన్నేలితివి
వేయిటికి మొక్కేఁ జుమ్మీ విన్నపము సేసితి
॥పతి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము