శృంగార సంకీర్తన
రేకు: 1967-3
సంపుటము: 29-339
రేకు: 1967-3
సంపుటము: 29-339
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| ఇవివో నీ కాంత సుద్దు లేమని చెప్పేమిఁక జవళి నీవూఁ గూడితే సంతోసాలయ్యీని | ॥పల్లవి॥ |
| వుడివోనితమితోడ నుమ్మగిలీ జవరాలు వొడలి చెమటలతో నోలలాడీని చిడుముడి కోరికల చిత్తమెల్లాఁ జంచలించి అడరి నిట్టూర్పుల నుయ్యాల లూఁగీని | ॥ఇవి॥ |
| విరహపు వేదనల వీడు దోడాడుకొంటాను సరి నెదురుచూపుల జాజరాడీని మరగిన మమతలు మక్కళించి మక్కళించి తురుము వీడి చీఁకటిఁ దులఁదూఁగీని | ॥ఇవి॥ |
| చెలులతో నీ సుద్దులు చెప్పి చెప్పి పులకల వలపుల రతులకు వంతులాడీని యెలమి శ్రీవేంకటేశ యింతలో నిన్నుఁ బెండ్లాడి మొలక నవ్వు లెల్లాను ముప్పిరి వేసీని | ॥ఇవి॥ |


