శృంగార సంకీర్తన
రేకు: 1967-6
సంపుటము: 29-342
రేకు: 1967-6
సంపుటము: 29-342
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సింధురామక్రియ
| ఆలి మగని తగవులవిగో చెప్పితి నీకు వాలాయముగా మఱవక తలఁచుకొమ్మీ | ॥పల్లవి॥ |
| యెడసిన తమితోడ నెంతయినా సొలతురు పడఁతులయ్యినవారు పతిని అడరి నీవు రావలెనని చెలికత్తెలచే యెడ మాఁటల దూరితి నెగ్గుపట్టేవు సుమ్మీ | ॥ఆలి॥ |
| కాఁకఁ బొరలినందుకు కైమీరి చెనకుదురు యేఁకరిన సతులు త మ్మేలినవాని తేఁకువతో నీవు నన్ను దిష్టించి చూడవలసి పోఁక పూఁబిలవేసితి పొంచి వోరుచుకొమ్మీ | ॥ఆలి॥ |
| అంచెలఁ గూడేటి వేళ అట్టె యేమైనాఁ జేతురు పొంచుకున్న వనితలు పొందైనవాని యెంచఁగ శ్రీవేంకటేశ యెనసేవేళ నీ మోవి యించుక గంటిసేసితి నేమీ ననకుమీ | ॥ఆలి॥ |


