శృంగార సంకీర్తన
రేకు: 1968-2
సంపుటము: 29-344
రేకు: 1968-2
సంపుటము: 29-344
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఈ రీతి నా వలపులు యెంతని చెప్పుదు నీకు కోరిన నా కోరికలు కొనసాగెనయ్యా | ॥పల్లవి॥ |
| చెలికత్త లెల్లా నిన్నుఁ జెప్పఁగానే విని విని వెలలేని వేడుకల విఱ్ఱవీఁగీని కలువరేకులవంటి కన్నుల నిప్పుడు చూచి తెలివితో నానందాన తెప్పలఁ దేలీని | ॥ఈరీతి॥ |
| వొద్దనుండి ఇంతవడి వూడిగాలు నీకుఁ జేసి పొద్దులు వుచ్చుక కొంత భోగించీని సుద్దులు నీతోఁ జెప్పి చుట్టరికాలు నెరపి అద్దుక సరసమాడి ఆయము గరఁగితి | ॥ఈరీతి॥ |
| చిత్తమెరిఁగినదాఁకా సిగ్గువడి పానుపుపై బత్తితో నీ కూటములు భావించుకొంటి ఇత్తల శ్రీవేంకటేశ ఇట్టె నన్ను నేలితివి నెత్తమాడి సంతోసాన నెమ్మది నవ్వితి | ॥ఈరీతి॥ |


