శృంగార సంకీర్తన
రేకు: 1968-5
సంపుటము: 29-347
రేకు: 1968-5
సంపుటము: 29-347
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాగవరాళి
| ఇందాఁకా నెఱఁగనైతి నిట్టె నీ మంచితనాలు అందమాయఁ బనులయ్యా ఔదువయ్యా జాణవు | ॥పల్లవి॥ |
| చెక్కు నొక్కి వేఁడుకోఁగా చిత్తము గరఁగె నాకు మొక్కేమయ్యా నీకు ముదమలర మిక్కిలి బుజ్జగించఁగా మించిన కోపము దీరె ఇక్కువకు రావయ్యా ఇందవయ్యా విడెము | ॥ఇందాఁ॥ |
| లాలించి కోఁగలించఁగా లలి మొక దాకిరాయ ఆల నైతినయ్యా నీకు నన్నిటా నేను మేలిములు నీ వాడఁగా మేలుదాననైతి నీకు యేలుకోవయ్యా చనవియ్యవయ్యా నాకును | ॥ఇందాఁ॥ |
| చేవట్టి గారవించఁగా చింతలెల్లాఁ బెడఁబాసె సేవ సేసేనయ్యా నీకు చేతులారాను శ్రీవేంకటేశ కూడఁగా నెలవుల నవ్వువచ్చె కైవసమై వుండువయ్యా కానీవయ్యా నమ్మితి | ॥ఇందాఁ॥ |


