శృంగార సంకీర్తన
రేకు: 1969-5
సంపుటము: 29-353
రేకు: 1969-5
సంపుటము: 29-353
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఎంతవని సేసితివో యిందాఁకా నీవు చెంత నిన్ను గిజి గిజి సేసిన దెవ్వతయ్యా | ॥పల్లవి॥ |
| చెక్కులవెంటా నిండుఁ జమటలు గారఁగాను యెక్కడ నుండి వచ్చితి వేమయ్యా మక్కువతో నిన్నుఁ జూచి మనసు నీరై కరఁగె అక్కడ నెవ్వతె నిన్ను నలయించెనయ్యా | ॥ఎంత॥ |
| వీఁపువెంటాఁ గొప్పువీడి విరులు రాలఁగాను యేపున వడదేరీ యో మిదేలయ్యా వోపిన నీ యలమటకొగిఁ గనికరమాయ రాఁపుల నిన్నుఁ బెట్టిన రమణి యెవ్వతెయ్యా | ॥ఎంత॥ |
| సెలవులవెంటాఁ దమ్మచెదరులు రాలఁగాను యెలమిఁ గప్రమడిగే వెంత కెంతయ్యా అలరి శ్రీవేంకటేశ యట్టె నన్ను నేలితివి పొలఁతి యెవ్వతె నిన్నుఁ బుత్తెంచెనయ్యా | ॥ఎంత॥ |


