శృంగార సంకీర్తన
రేకు: 1969-6
సంపుటము: 29-354
రేకు: 1969-6
సంపుటము: 29-354
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| చెలులాల చూడరే చెలువుని మన్ననలు యెలమి నా భాగ్య మిఁక నేమని చెప్పుదునే | ॥పల్లవి॥ |
| ఆనలువెట్టి పిలిచి యాసలెంత రేఁచీనే తా నెంత నే నెంత తమకించీని ఆనుకొని నా వలపు ఆరడి నేల పెట్టీనే మోనముతోఁ జేతులెత్తి మొక్కుతా నుందానను | ॥చెలు॥ |
| కాలు దొక్కి మనసెంత కరఁగించి చొక్కించీనే యేలినవాఁడు తాను యిల్లాల నేను మూలనున్న నా సిగ్గు ముంగిట నేలవేసీనే గోలతనమున వేఁడుకొంటా నుందానను | ॥చెలు॥ |
| కూడి యంత సంతోసాన గుబ్బతిలఁ జేసీనే వేడుకకు ముందే తను వెనక నేను యీడనే శ్రీవేంకటేశుఁ డెనసి యాల మెచ్చీనే ఆడ నీడాఁ దనుఁ గొనియాడుతానుందానను | ॥చెలు॥ |


