శృంగార సంకీర్తన
రేకు: 1970-1
సంపుటము: 29-355
రేకు: 1970-1
సంపుటము: 29-355
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| వాకిట నేమి సేసేవు వనిత నీకు మేలుది దాకొని నీ వొడఁబాటు తప్పకువయ్యా | ॥పల్లవి॥ |
| వెన్నెల బాయటనుండి వెలఁది నిన్నుఁ బిలిచీ పన్నుకొని మరియేమో పని గద్దంటా యిన్నిటా నే మాడిగితే నించుకంతైనాఁ జెప్పదు విన్నపమేమి సేసీనో విందువు రావయ్య | ॥వాకి॥ |
| మేడలోననుండి నీకు మెలుఁత లేక లంపె జోడుగూడి సంతోసపు సుద్దులకును వోడక ముద్దురతోనే వున్నవి నేమెరఁగము జాడతోడ నీకు నీవే చదువుకోవయ్యా | ॥వాకి॥ |
| యింటితోనుండి వుంగర మింతి నీకుఁ జూపుమనె తొంటిమాఁట నీవే తలఁతు వనుచును జంటై వచ్చి కూడితివి సరుగ శ్రీవేంకటేశు అంటి యీకెతో నేకత మాడుకోవయ్యా | ॥వాకి॥ |


