శృంగార సంకీర్తన
రేకు: 1970-3
సంపుటము: 29-357
రేకు: 1970-3
సంపుటము: 29-357
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| తా నూరకే యా పనులు దడవీఁ గాక నేనేమైనాఁ దనమీఁద నేరాలు వేసేనా | ॥పల్లవి॥ |
| యెట్టుండినా నమ్మక తన్నెగసక్కాలాడేనా పెట్టరాని యానలేల పెట్టుకొనీనే గుట్టుతోడఁ దలవంచుకొని వున్నదాన నేను నట్టనడుమఁ దానేల నవ్వులు నవ్వీనే | ॥తానూ॥ |
| యెంతసేసినాఁ దనపై యిట్టే నిందలు మోపేనా కాంతలఁ దెచ్చేల తారుకాణ సేసీనే సంతోసాన నాలో నేనే సమ్మతించుకున్నదాన చెంతనుండి మరి నేల సిగ్గులు వడీనే | ॥తానూ॥ |
| యేరీతి మెలఁగినాను యెగ్గుపట్టి దూరేనా సారె నన్నే లొడఁబరచఁగ వచ్చీనే కోరి శ్రీవేంకటేశుఁడు కూడినాఁడు దా నన్ను గారవించి యాల యిచ్చకములు నెరపీనే | ॥తానూ॥ |


