శృంగార సంకీర్తన
రేకు: 1970-5
సంపుటము: 29-359
రేకు: 1970-5
సంపుటము: 29-359
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఇంకనేల సిగ్గువడే విద్దరు నున్నా రీడను కొంకక నన్ను మన్నించి కూడితివి నాఁడే | ॥పల్లవి॥ |
| కంకణాలచేత నాపె కానుక లిచ్చీ నీకు అంకెలఁ బరాకుమాని అందుకోవయ్యా సంకెలేల నీముందర చక్కఁగా నిలుచున్నది పంకించక నీ మోము చూపఁగదవయ్యా | ॥ఇంక॥ |
| మూరెఁడు దురుమువంచి మునుకొని మొక్కీ నీకు తేరకొనఁ జూచాకెను దీవించవయ్యా కూరిమి గొసరి నీ కొలువులు సేసీని సారెకును మెచ్చి మెచ్చి సంతోసించవయ్యా | ॥ఇంక॥ |
| వెలయ కప్రపు నోర విన్నపాలు సేసీ నీకు లలిఁ జెవ్వులారా విని లాలించవయ్యా అలమేల్మంగను నే నీ యాలను శ్రీవేంకటేశ వలచి వచ్చినాపెను వడిఁ జేకొనవయ్యా | ॥ఇంక॥ |


