శృంగార సంకీర్తన
రేకు: 1970-6
సంపుటము: 29-360
రేకు: 1970-6
సంపుటము: 29-360
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఎంత గుట్టు నెరపేవే యెందాఁకాను పొంతనే మగనితోఁ గాపురము సేయఁగదే | ॥పల్లవి॥ |
| వుమ్మగిలుఁ జెమటలు వుప్పతిలీ నీమేన కమ్ముకొన్నవలపు లెక్కడ దాఁచేవే నెమ్మది నీ తలపోఁత నిట్టూరుపులే చెప్పీ అమ్మరో నీ విరహ మెట్టడంచుకొనేవే | ॥ఎంత॥ |
| సురతపు టాసలు చూపులలోన నున్నవి వరుస నీ తమక మేవంకఁ బెట్టేవే నిరతపు నీ మర్మాలు నివ్వెరగులే చెప్పీ సొరిది నీ మోమువాడుచొ ప్పెట్టు మాపేవే | ॥ఎంత॥ |
| చేవదేరి పులకలు చెక్కలను నిండుకొనె కావరపు సిగ్గు లేడ గాదెఁబోసేవే నీ వలమేలుమంగవు నిన్నేలె శ్రీవేంకటేశుఁ - డీవల మదనచినలేగంపఁగమ్మేవే | ॥ఎంత॥ |


