శృంగార సంకీర్తన
రేకు: 1971-3
సంపుటము: 29-363
రేకు: 1971-3
సంపుటము: 29-363
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| సేసినవె చేఁత లిఁకఁ జెలఁగరే మీ రిద్దరు మోసపో వీవలపులు ముయికి ముయౌను | ॥పల్లవి॥ |
| యీడు జోడై పెనఁగితి నింతులకుఁ బతులకు వేడు కెంత గలిగినా వేసటగాదు పాడి పంతా లొక్కపై పరగినవారికి చూడఁ జూడఁ జేకొన్నదే చుట్టరిక మగునే | ॥సేసీ॥ |
| చిగిరింపుఁ జిత్తములఁ జెనకేటివారికి తగిలి యెంత గూడినాఁ దనివిలేదు పగటునఁ బొందుగల్గి పాయకున్నవారికి నగితే నెదురుబడి నాములెక్కును | ॥సేసీ॥ |
| బత్తితోడ నే పొద్దూఁ బాయకుండి వారికి చిత్తా లెంత గరఁగినా సిగ్గు వుట్టదు హత్తి శ్రీవేంకటేశుఁడు అలమేల్మంగ నిన్నేలె పొత్తుల రతులు మీకుఁ బోరచులౌను | ॥సేసీ॥ |


