శృంగార సంకీర్తన
రేకు: 1971-5
సంపుటము: 29-365
రేకు: 1971-5
సంపుటము: 29-365
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| కంతుఁడు సేసిన మాయ గడవరాదు యెంతైనాఁ దప్పించుకొన నెట్టు వచ్చునే | ॥పల్లవి॥ |
| నిక్కి చూచిన చూపుల నిండా నాసలు వుట్టించు మొక్కిన మొక్కులే కడు మొగ మోడించు పక్కన నవ్విన నవ్వే భావములు గరఁగించు యెక్కడాఁ దప్పించుకొన నెట్టు వచ్చునే | ॥కంతుఁ॥ |
| తలఁచిన తలఁపులే తగులాయములు సేసు పలికిన పలుకులే పాదకొలుపు సొలసిన సొలపులే చుట్టరిక మొనరించు యెలమిఁ దప్పించుకొన నెట్టు వచ్చునే | ॥కంతుఁ॥ |
| పెనఁగిన పెనఁగులే ప్రియములు వెడరేఁచు ననిచిన ననుపులే నంటుకొలుపు చెన కెలలమేల్మంగను శ్రీవేంకటేశుఁడు గూడె యెనసి తప్పించుకొన నెట్టు వచ్చునే | ॥కంతుఁ॥ |


