శృంగార సంకీర్తన
రేకు: 1972-1
సంపుటము: 29-367
రేకు: 1972-1
సంపుటము: 29-367
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| మేలు మేలు చెలులెల్లా మెచ్చిరి నీ చేఁతలకు చాలా నేరుపుల నీతో సరి యెవ్వరమ్మా | ॥పల్లవి॥ |
| పెదవినే మాఁటలాడి పిలిచేవు రమణుని కదలుఁ గన్నులఁ జూచి కరఁగించేవు వెదచల్లునవ్వులను వేడుకులు రేఁచేవు చదురుఁదనాల నీతో సరి యెవ్వరమ్మా | ॥మేలు॥ |
| సన్నలనే యాతనితో సాములెల్లాఁ జేసేవు తిన్నని తురుము చూపి తేలించేవు చన్నులంటి వలపులు చవులు వుట్టించేవు సన్నుతించేనంటే నీతో సరి యవ్వరమ్మా | ॥మేలు॥ |
| వింతగా మొక్కుతానే శ్రీవేంకటేశు నుబ్బించేవు పొంత నలమేల్మంగవై పోది సేసేవు యింతలోనే నిన్ను నేలె యీతఁ డిన్నిటా వలచి సంతతము నీతో నింత సరి యవ్వరమ్మా | ॥మేలు॥ |


