శృంగార సంకీర్తన
రేకు: 1972-5
సంపుటము: 29-371
రేకు: 1972-5
సంపుటము: 29-371
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| వేడు కిది దాఁచరాదు వెల్లవిరిఁ జేయరాదు కూడిన తారుకాణలు గుట్టుతోనే వున్నవి | ॥పల్లవి॥ |
| ఆడుకోలుమాఁట గద్దు ఆతనికి నాకును తోడితేవే విన్నవించే తోడనే నేను జోడిం చొకరితోఁ జెప్పేసుద్దులు గావు జాడతో నే నెరుఁగుదు సరిఁ దా నెరుఁగును | ॥వేడు॥ |
| సేసిన గురుతు గద్దు చేరి మా యిద్దరికి రాసికెక్కఁ జూచెను రమ్మనఁగదె మూసిమంతనములైన మొరఁగులవి ఆసల నాయందు నున్నవా తనందు నున్నవి | ॥వేడు॥ |
| యేకతపు పొందు గద్దు యిద్దరికిని జోకతో శ్రీవేంకటేశుఁ జూపఁగదవే మాకె తెలుసు నలమేలుమంగను నేను యీకడ నా మగఁ డీతఁ డీతని దేవులను | ॥వేడు॥ |


