శృంగార సంకీర్తన
రేకు: 1973-2
సంపుటము: 29-374
రేకు: 1973-2
సంపుటము: 29-374
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఎక్కడనుండి వచ్చెనో యేఁకరి నీ రతులకు చిక్కించుక కాఁపురము సేయవయ్యా | ॥పల్లవి॥ |
| లక్కవలెఁ గరఁగీని లలన నీ మాఁటలకు చొక్కుచు నాపె వలపు చూడవయ్యా మొక్కుచు వినయాన నీ ముందర నిలుచున్నది అక్కర యెంత గలదో అడుగవయ్య | ॥ఎక్క॥ |
| జిగురువలె నంటీని చెలియ నీ పొందులకు తెగని చుట్టరికము తెలియవయ్యా నగుతా సారెకు నీతో ననుపులే పచరించీ చిగిరింపుఁ గోరికలు చెల్లించవయ్యా | ॥ఎక్క॥ |
| తేగెవలె నల్లుకొనీ తెరవ నీ కాఁగిటికి జాగులు సేయ కది విచారించవయ్యా యీగతి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను బాగుగా నన్నేలితి వాపడఁతి నేలవయ్యా | ॥ఎక్క॥ |


