శృంగార సంకీర్తన
రేకు: 1973-5
సంపుటము: 29-377
రేకు: 1973-5
సంపుటము: 29-377
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| ఇంతి లాగులెల్లా నీకు నెరిఁగించితిమి నేము మంతు కెక్కించి యీపెను మన్నించవయ్యా | ॥పల్లవి॥ |
| యెదురులు చూచీ నీకు;యింతులనుఁగొంతదూరు వుదుటు గుబ్బలపై నిట్టూర్పు చల్లును చెదరుఁగురులు దువ్వు చెక్కుపైఁ జేయి చేర్చు యిదివో నీ సతి సుద్దు లింకా నడుగవయ్యా | ॥ఇంతి॥ |
| నిలువెల్లాఁ జెమరించు నీపై పాటలు వాడు తలఁచు నీ రూపము తమకించును సొలసు నూరక నిన్ను చొక్కుఁదనలోనె తాను వెలఁది వలపు రీతి విన్నవించితిమయ్యా | ॥ఇంతి॥ |
| నివ్వెరగుతో నుండు నీకు లేకలు వాసు పవ్వళించి నీ రతులు భావించును ఇవ్వల శ్రీవేంకటేశ ఇంతి నిట్టె యేలితివి రవ్వలాయ నీకుఁగానే రమణిఁ జూడవయ్యా | ॥ఇంతి॥ |


