శృంగార సంకీర్తన
రేకు: 1973-6
సంపుటము: 29-378
రేకు: 1973-6
సంపుటము: 29-378
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఎఱుఁగుదుఁ దన సుద్దు లిన్నియుఁ దొల్లె నేను తఱచాయ ముచ్చటలు తలఁచుకొమ్మనవే | ॥పల్లవి॥ |
| ననుపులు నిజమైతే నవ్వులు సేనాసేన మనసు లెనసితేను మాఁటలు పెక్కు వినయము నెరిచితే వెలయు సంగాతము తనతో నెదురాడేనా దగ్గరి రమ్మనవే | ॥ఎఱుఁ॥ |
| చూపులు నాఁటఁ జూచితే చొక్కులు కోటానఁగోటి వోపికలు గలిగితే వొడి నిండును కాఁపురాలు సతమైతే కైవసమౌ వలపులు యే పనులు చెప్పినాను ఇయ్యకొంటి ననవే | ॥ఎఱుఁ॥ |
| సరసము లొనరితే చనవులు చెల్లుబడౌ సరవులు చక్కనైతే చవులు వుట్టు ఇరవై శ్రీవేంకటేశుఁ డిప్పుడు వచ్చి నన్నేలె మరిగితి నిట్లనే మన్నించు మనవే | ॥ఎఱుఁ॥ |


