శృంగార సంకీర్తన
రేకు: 1974-2
సంపుటము: 29-380
రేకు: 1974-2
సంపుటము: 29-380
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| నాపై బత్తి గలఁడు నన్ను మన్నించీ నితఁడు రేపు మాపుఁ జింత లిఁక రేఁచకురే మీరు | ॥పల్లవి॥ |
| చెలిమి సేసినవాఁడు సేవ గొనకుండునా పలుమారు పతికిఁ జెప్పుకురే మీరు వలపించినట్టివాఁడు వాడిక లెరఁగఁడా బలిమిసేసి కొంగువట్టకురే మీరు | ॥నాపై॥ |
| యింటికి వచ్చినవాఁడు యెనయక వుండునా అంటి ముట్టి సారె సొలయకురే మీరు జంటయై పాయనివాఁడు చనవెల్లా నియ్యఁడా దంటతనాన నేమీఁ దడవకురే మీరు | ॥నాపై॥ |
| నమ్మిక లిచ్చినవాఁడు నన్ను నేలకుండునా కమ్మటిఁ గమ్మిటిఁ బెనఁగకురే మీరు ఇమ్ముల శ్రీవేంకటేశుఁ డిటు వచ్చి నన్నుఁ గూడె చిమ్ముఁగొనగోళ్ల సన్న సేయకురే మీరు | ॥నాపై॥ |


