శృంగార సంకీర్తన
రేకు: 1974-3
సంపుటము: 29-381
రేకు: 1974-3
సంపుటము: 29-381
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| నామీఁది బత్తితోడ నన్నుఁ బాయకున్నాఁడవు వేమరు నుపాయాలు విచారించుకోవయ్యా | ॥పల్లవి॥ |
| ఇంటికి రావైతివంటా యెక్కడనో వుంటివంటా కంటకము లే మాడునో కలికి నిన్ను దంటతనాన నేమని తప్పించుకొనేవు నీవు కంటే మొకదాకిరి గన మాపె యెడకు | ॥నామీఁ॥ |
| చెమట మెఇ నున్నదంటా చెదరె నీ కురులంటా తమకించి యేమనునో తరుణి నిన్ను అమర నెట్లా మాటలాడుకొనేవో నీవు సముకాన నిచ్చకుఁడవు నీవు | ॥నామీఁ॥ |
| నాకు మేలువాఁడవంటా నమ్మిక లిచ్చితివంటా యీకె రతి నెంత యలయించునో నిన్ను చేకొని న న్నేలితివి శ్రీవేంకటేశుఁడ పైకొని యాపె నెట్టొడఁబరచేవో నీవు | ॥నామీఁ॥ |


