శృంగార సంకీర్తన
రేకు: 1974-6
సంపుటము: 29-384
రేకు: 1974-6
సంపుటము: 29-384
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
| నవ్వేవారి నెఱఁగవు నాతిరో నీవు పువ్వువంటి సిగ్గు దెచ్చి పొల్లు సేయవలదే | ॥పల్లవి॥ |
| హత్తి నేనూ నాతఁడు నంటి సరసమాడఁగా పొత్తుగలయవచ్చేవు పొసఁగునటే కొత్తగాఁ గన్నకలలు కోరి నేము చెప్పుకోఁగా వొత్తి యర్థా లడిగేవు వుండఁబట్ట దటవే | ॥నవ్వే॥ |
| జాడతో నిద్దరము సేసలు చల్లుకొనఁగాను తోడఁ బెండ్లాడ వచ్చేవు దొరసునటే నీడల చక్కఁదనాలు నే మద్దములోఁ జూడఁగా ఆడ నీ మొగము చూపే వమరునటే | ॥నవ్వే॥ |
| తేరకొన మాలో నేము తెరవేసుకుండఁగాను పోర చెడుగ వచ్చేవు పొద్దువోదటే యీరీతి శ్రీవేంకటేశుఁ డిన్నిటా న న్నేలఁగాను నేరిపేవు రతు లోతనికిఁ దగునటవే | ॥నవ్వే॥ |


