శృంగార సంకీర్తన
రేకు: 1975-1
సంపుటము: 29-385
రేకు: 1975-1
సంపుటము: 29-385
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్రం
| ఎట్టున్నదో నీ చిత్తము యెఱఁగమయ్యా చుట్టపు వరుసలివి చూచుకొనేవయ్యా | ॥పల్లవి॥ |
| చెలిచే నప్పుడు నీవు చెప్పి పంపిన సుద్దులు వెలఁది వేడుకతోడ వినెనయ్యా వలపులు లేకలపై వాఁతలఁ జదువుకొని నలిరేఁగి పకపక నవ్వెనయ్యా | ॥ఎట్టు॥ |
| అచ్చలాన నీ వుంగర మానవాలు చూచుకొని ముచ్చటతోఁ జేతులెత్తి మొక్కెనయ్యా మచ్చిక నీవు మన్నించే మన్నన దలఁచుకొని కచ్చు పెట్టి సంతోసానఁ గడుఁ బొగడేనయ్యా | ॥ఎట్టు॥ |
| కడు బత్తి సేసి నీవు కాఁగిలించుకొన్నందుకు కడఁకతోడ మనసు గరఁగెనయ్యా యెడయక శ్రీవేంకటేశ నీ గుణ మెరిఁగి బడివాయనని నీతో బతిమి వట్టెనయ్యా | ॥ఎట్టు॥ |


