శృంగార సంకీర్తన
రేకు: 1975-4
సంపుటము: 29-388
రేకు: 1975-4
సంపుటము: 29-388
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| నా మన సేమి చూచీని నంటునఁ దానే నేను యేమి నన నిఁక నేల ఇంటికి రమ్మననే | ॥పల్లవి॥ |
| పాయని చుట్టరికము పరిసిపోదెంతైనా నాయముతోడి నడక నమ్మవచ్చును చేయి మీఁదిఇనచేఁత చెల్లుబడి గాక పోదు యేయెడాఁ గొంకఁగనేల యింటికి రమ్మనవే | ॥నా మన॥ |
| మచ్చికతోడివలపు మానుపరా దెంతైనా అచ్చలమైనసరస మాస రేఁచును కొచ్చి కొచ్చి పెనఁగితే కూటములు చవివుట్టు యెచ్చరిక సేయనేల యింటికి రమ్మనవే | ॥నా మన॥ |
| దట్టమైన వినయాలు దాఁగనియ్య వెంతైనా నెట్టుకొన్న పొందులు నెరవేర్చును జట్టిగొని శ్రీవేంకటేశ్వరుఁడు నన్నిపుడేలె యిట్టె దిన దినమూ నింటికి రమ్మననే | ॥నా మన॥ |


