శృంగార సంకీర్తన
రేకు: 1975-5
సంపుటము: 29-389
రేకు: 1975-5
సంపుటము: 29-389
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వసంతవరాళి
| ఎన్నేని విన్నవించే మిపుడు నీకు అన్నీ నీవే తెలుసుక యాదరించవయ్యా | ॥పల్లవి॥ |
| అలివేణిమదిలోని ఆడియాసలు పలుకుల వినయపు పరిబాసలు చెలరేఁగి పట్టిన దోసిటి సేసలు చెలియ చందము లివి చిత్తగించవయ్యా | ॥ఎన్నే॥ |
| కమ్ముకొన్న తమకపుకనుచూపులు తమ్ములపు మోవితేనె తరితీపులు పిమ్మట సన్నలు సేసే పెరరేఁపులు నెమ్మది నీవెచూచి మన్నించఁగదవయ్యా | ॥ఎన్నే॥ |
| వొద్దికైననీపై మొగమోటలు కొద్దిలేని నీ రతులు కూటములు ముద్దరాలి నేలితివి ముప్పిరి శ్రీవేంకటేశ పొద్దు వొద్దు దప్పకుండా భోగించవయ్యా | ॥ఎన్నే॥ |


