శృంగార సంకీర్తన
రేకు: 1976-2
సంపుటము: 29-392
రేకు: 1976-2
సంపుటము: 29-392
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| వచ్చి వచ్చి మూడీఁ జొచ్చి వాత వెళ్ల నేమిటికే మచ్చిక నీతఁడు నన్ను మన్నించెఁ జూడఁగదె | ॥పల్లవి॥ |
| సంగడి నుండి పతికి చనవరి వైతివి అంగము లంటి యంటి ఆలవైతివి యెంగలి మోవి చూపి యితరివైతివి అంగడి నీ దొరతనాలవి యేమి చెప్పేదే | ॥వచ్చి॥ |
| సుద్దులెల్లాఁ జెప్పుతానే చుట్టమవూ నైతివి పెద్దగా నవ్వులు నవ్వి ప్రియమైతివి బద్దులు మొక్కులు మొక్కి పాఁతదానవైతివి చద్ది వేఁడినీ బీరాలు సారె నేమి చెప్పేదే | ॥వచ్చి॥ |
| వన్నెగా సేవలు సేసి వాడికకతైవైతివి సన్నలు సేసిసేసి సతమతమైతివి యిన్నిటి శ్రీవేంకటేశుఁ డేలె నన్నుఁ దొలుతనే యెన్నిక నీ కాఁపురాలు యేమి చెప్పేదే | ॥వచ్చి॥ |


